మహిళలు తమపై జరుగుతున్న దాడులను నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాచకొండ షీ టీం పోలీసుల బృందం సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంస్థ ఆధ్వర్యంలో సంఘమిత్ర కార్యక్రమం ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు.
మహిళల రక్షణ కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రాచకొండ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సుమారు వెయ్యి మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించామని వెల్లడించారు. వారి ద్వారా మరికొంతమందికి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు.. విద్యార్థులకు పోటీలు'