ETV Bharat / state

Ganesh navaratri celebrations: ఆ గణపయ్యకు కానుకలు ఎలా సమర్పించాలో తెలుసా?

పెరిగిన సాంకేతికతతో ఏటా జరిగే గణపయ్య ఉత్సవాల్లోనూ(ganesh) ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తుండగా... కానుకలు సమర్పించడానికి సంస్థాన్ నారయణపురం యువత వినూత్న ఏర్పాటు చేశారు. అదేంటంటే...

Ganesh navaratri celebrations, ganesh chaturthi 2021
వినూత్నంగా గణపయ్య ఉత్సవాలు, గణేశ్ నవరాత్రి వేడుకలు
author img

By

Published : Sep 12, 2021, 5:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో గణపయ్య నవరాత్రి ఉత్సవాలను(Ganesh navaratri celebrations) వినూత్నంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కానుకలు సమర్పించేందుకు సరికొత్తగా క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటుచేశారు. స్కానింగ్ ప్రింట్‌ను వినాయకుని ప్రతిమ చేతిపై ఉంచి భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల కోసమే వినూత్నంగా ఈ పద్ధతిని ఏర్పాటుచేసినట్లు మండప నిర్వాహకులు తెలిపారు.

ఈ కరోనా(corona) సమయంలో ఎక్కువగా కరెన్సీ నోట్లను వాడడం లేదు. అందుకోసం కొత్త ఆలోచనలతో మా మండపం వద్ద ఆన్‌లైన్‌ (online transactions)ద్వారా కానుకలు సమర్పించే వీలు కల్పించాం. భక్తుల సౌకర్యం కోసమే క్యూఆర్ కోడ్‌ని(qr code) ఏర్పాటు చేశాం. ఈ నిర్ణయంతో నిర్వహణ ఖర్చుల లెక్కలు కూడా పారదర్శకంగా ఉంటాయి.

-నిర్వాహకులు

వినూత్నంగా గణపయ్య ఉత్సవాలు

ఇదీ చదవండి: Ganesh chaturthi: గణపయ్యల కనువిందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.