యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరంలో వరుస హత్యల నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్ గ్రామస్థులు ఆమరణ నిరహార దీక్షకు దిగారు. హాజీపూర్ నుంచి బొమ్మలరామరం వరకు ర్యాలీగా వచ్చి దీక్షను చేపట్టారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితునికి వెంటనే మరణశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ బొమ్మలరామరం చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. రిమాండ్, కస్టడీ పేరుతో నిందితుడికి శిక్షపడకుండా కాలయాపన చేయొద్దని కోరారు. శాంతియుతంగా చేపట్టిన దీక్షకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
' సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష వేయాలి' - PSYCHO KILLER
సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష వేయాలని యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామస్థులు ఆమరణ నిరహార దీక్షకు దిగారు. రిమాండ్, కస్టడీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫాస్ట్ట్రాక్కోర్టు ద్వారా వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.