యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లిలో మేకలకాడి పోశమ్మ గుడి నిర్మాణం విషయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నెల 30న ఆర్ఐ జహంగీర్, రెవెన్యూ సిబ్బందితో వచ్చి గుడి నిర్మాణాన్ని తొలగించారు. ఆర్ఐ గుడిని కాలితో తన్నాడని... గొల్లకుర్మ కులస్థులు, గ్రామస్థులు ఈ నెల 1న నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధికారులు జహంగీర్‌ను సస్పెండ్ చేశారు.
ఈ రోజు గుడి నిర్మాణం చేపడుతుండగా... పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 157లోనే గుడి నిర్మిస్తున్నట్టు గ్రామస్థులు అంటుండగా... రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్నారు. దీంతో పోలీసులు, అధికారులు గ్రామస్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలను సూచిస్తున్నారు. సున్నిత అంశం కావటం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు.
ఇదీ చూడండి: యాదాద్రి బాలాలయంలో విశేష పూజలు