రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట మండంలంలోని పలు గ్రామాల్లో జాగృతి పోలీస్ కళాబృందం వారిచే రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహనా కార్యక్రమం చేపట్టారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు గొల్లగూడెం, దాతర్పల్లి, రాళ్లజనగాం, లప్ప నాయక్ తండ, మైలార్ గూడెం, పెద్ద కందుకూరు, వంగపల్లి, జంగంపల్లి గ్రామాల్లో ప్రదర్శనలు చేపట్టారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. బయటకు వెళ్ళినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని... భౌతిక దూరం పాటించాలని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ప్రదర్శనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు, స్థానిక పోలీసులు, పాల్గొన్నారు.