యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వివరాలు తెలిపి అనుమతులు తీసుకోవాలని సూచించారు. తమ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు సుమారు నలుగురు కాపలాగా ఉండాలన్నారు. నిమజ్జనం వివరాలు ముందుగా పోలీసులకు తెలపాలని... తమ వంతు రక్షణ కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: మాతృత్వానికే కళంకం... కన్నకూతురినే బస్సుకిందకు తోసేసింది!