ETV Bharat / state

మస్తాన్ వలీ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు

చౌటుప్పల్ వద్ద జరిగిన ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్​ వలీ కుమారుడు షేక్ షారుఖ్ మరణించాడు. వారి కుటుంబానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

pcc chief Uttam Kumar Reddy visiting the Mastan Wali family
మస్తాన్ వలీ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
author img

By

Published : Nov 4, 2020, 3:11 PM IST

Updated : Nov 4, 2020, 3:54 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జరిగిన ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్​వలీ కుమారుడు షేక్​ షారుఖ్ మరణించాడు. వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం షారుఖ్​కు నివాళి అర్పించారు.

షేక్‌ షారుఖ్‌(22) తన స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. చౌటుప్పల్ సమీపంలోని ధర్మోజిగూడెం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే చలి వేస్తోందని ద్విచక్రవాహనాన్ని హైవే పక్కన నిలిపి స్వెట్టర్‌ ధరిస్తున్నారు. ఈ సమయంలో చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై కూర్చొని ఉన్న షారుఖ్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ఫయాజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

ఇదీ చూడండి: చలివేస్తుందని ఆగాడు.. అనంతలోకాలకు పోయాడు

Last Updated : Nov 4, 2020, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.