యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పరిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం రెండోరోజు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నవకళాభిషేకం, హవనం, మూలమంత్ర జపాలు, నిత్యహోమాలు, నిత్య లఘుపూర్ణాహుతి, వేద, ఇతిహాస, పురాణం, ప్రబంధ పారాయణాలు చేపట్టారు.
మంగళవారం స్వస్తివాచనంతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. రేపు పూర్ణాహుతి, పవిత్ర మాలల ధారణతో ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా నేడు, రేపు రెండు రోజుల పాటు స్వామివారికి జరిపే సుదర్శన, నారసింహ హోమం, కల్యాణం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.
మంగళవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. ఈనెల 19 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజలు, భక్తులు తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలు చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాల ముగింపు అనంతరం తిరిగి 20 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు.
స్వామివారి పూజల్లో తెలిసీ తెలియక చేసే దోషాల నివారణకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి సుదర్శన, నారసింహ హోమాలు, కల్యాణం రద్దు చేశారు.
- యాదాద్రి క్షేత్ర అర్చకులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ప్రత్యేక కళాఖండాలు, ఆకృతులు, శిల్పాలు స్వామివారి ఆలయంలో కొలువుదీరుతున్నాయి. ఆలయం విద్యుద్దీపకాంతుల్లో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయంగా యాదాద్రిని ముస్తాబు చేస్తున్నారు.
ఇవీ చదవండి: