యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య, అనురాధలకు ముగ్గురు పిల్లలు. సత్తయ్య అనారోగ్యంతో గత సంవత్సరం జనవరిలో మరణించాడు. అప్పటి నుంచి తల్లి అనురాధ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటోంది. అయితే గతవారం రోజులుగా అనురాధ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి మరణించింది. ఫలితంగా ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. వారికి ఆస్తిపాస్తులు సైతం ఏమీ లేకపోవడం వల్ల ఇరుగు పొరుగు వారు తలా కొంత వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించారు.
చిన్నారులు ముగ్గురూ 10 సంవత్సరావల లోపు వారే కావడం వల్ల.. ఎవరైనా వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:- యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!