రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సరిగ్గా అమలు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో బదిలీ అయిన కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను ఆమె కలిశారు. కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు.
యాదాద్రి భువనగిరి జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టి ఎక్కువగా ఉంటుందన్నారు. తన పదవీకాలంలో జిల్లాలోని ఉద్యోగులందరూ సహకరించారని బదిలీ అయిన కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్