యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీస్‌స్టేషన్ ముందు పద్మశాలీలు బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. మంగళవారం పద్మశాలి కులస్థులను కించపరుస్తూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాడు. దీనిపై కులసంఘాల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోస్టు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు రహదారిని దిగ్బంధించటం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటం వల్ల నిరసన విరమించారు.