ETV Bharat / state

మూడో రోజు అంగరంగ వైభవంగా యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 6, 2022, 3:37 PM IST

Yadadri brahmotsavalu 2022: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీసమేత నారసింహుడు మత్స్యావతారంలో బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీన ముగుస్తాయి. విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన బాలాలయం.. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.

yadadri brahmotsavam
తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు

Yadadri brahmotsavalu 2022:యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీసమేత నారసింహుడు మత్స్యావతారంలో బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. 11రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈనెల 14వ తేదీన ముగుస్తాయి.

yadadri brahmotsavam
విద్యుత్ కాంతుల్లో యాదాద్రీశుడు

స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయం లోపలే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్తసముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షనార్ధం శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం దాల్చి వేదం పరిరక్షణ శిష్ట పరిరక్షణ చేశాడు నృసింహుడు.

yadadri brahmotsavam
విద్యుత్ కాంతుల్లో యాదాద్రీశుడు

yadadri brahmotsavam 2022: మొదట దాదాపు రెండు గంటలపాటు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణాలు, వేదపండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండువగా, వీనుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

yadadri brahmotsavam
విద్యుత్ మెరుపుల్లో యాదాద్రీశుడు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.

yadadri brahmotsavam
రహదారి మధ్యలో విద్యుత్ ధగధగ

ఇదీ చదవండి:ఆదిలాబాద్​లో అద్భుతం.. శివుని గుడిలో పాలు తాగుతున్న నంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.