నారసింహుని సన్నిధికి మరిన్ని హంగులు అద్దుతున్నారు ఆలయ అధికారులు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి బంగారు ఊయల సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా యాదాద్రి సన్నిధిలో కృష్ణ శిలతో పునర్నిర్మాణం చేపట్టారు. ఎక్కడా లేని విధంగా అష్ట భుజ మండల ప్రాకారాలు రూపొందించారు. ఆలయ ముఖ మండపంలో నిత్య సేవోత్సవానికి దాతల సాయంతో బంగారు ఊయల ఏర్పాటు చేయాలని యాడ అధికారులు నిర్ణయించారు.
ఆలయ గర్భగుడిపై కృష్ణశిలతో నిర్మితమైన దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయంగా మార్చే క్రతువులో భక్తులను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగారం సేకరణ యోచన చేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: ప్రకృతిపై ప్రేమ .. ఇంటి పైకప్పుపై 400 మొక్కల పెంపకం