ETV Bharat / state

ప్రాణాపాయస్థితిలో ప్రజలకు ఎంతో ఉపయోగం : పైళ్ల శేఖర్​రెడ్డి

'గిఫ్ట్​ ఏ స్మైల్​' కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి ఆధునాతన ఆంబులెన్స్​ను అందజేశారు. తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్​ చేతులమీదుగా ప్రారంభించారు.

New Ambulance donated by bhuvanagiri mla sekhar reddy to his constituency
ప్రాణాపాయస్థితిలో ప్రజలకు ఎంతో ఉపయోగం : పైళ్ల శేఖర్​రెడ్డి
author img

By

Published : Dec 9, 2020, 9:15 PM IST

ప్రతి శాసనసభ్యుడు తమ నియోజకవర్గానికి ఆంబులెన్స్​ను అందజేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి కోరారు. తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆంబులెన్స్​ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్ చేతుల మీదుగా ప్రారంభించారు. 'గిఫ్ట్ ఏ స్మైల్​' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వాహనాన్ని అందజేశారు.

ప్రాణాపాయస్థితిలో ఉన్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. జన్మదిన వేడుకల్లో డబ్బును వృథా చేయకుండా మంచి పనుల కోసం వినియోగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్​ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్​ చింతలకిష్టయ్య, వైద్యాధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్​కే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.