ETV Bharat / state

మేకలు, పందులు రోడ్లపైకొస్తే యజమానుల జేబులకు చిల్లులే! - goats on roads

కరోనా లాక్​డౌన్​ కాలంలో జనాలు బయటికొస్తే... జరిమానాలు వేశారు. ఇప్పుడు లాక్​డౌన్​ కూడా ఎత్తేశారు. అయినా... అక్కడ మాత్రం జరిమానాలు వేస్తున్నారు. అది కూడా మనుషుల మీద కాదండోయ్​... మేకలు, పందుల మీద...! ఇందేంటటే... మున్సిపాలిటీ అభివృద్ధి మంత్రం అంటున్నారు అధికారులు. ఆ కథేంటో మీరూ చదవండీ...

municipality officers charging fine on goats and pigs in mothkuru
ఇక్కడ మేకలు, పందులు రోడ్లపైకొస్తే యజమానుల జేబులకు చిల్లులే!
author img

By

Published : Jun 30, 2020, 9:09 PM IST

రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణలో భాగంగా కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆటంకంగా ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరించాలని అధికారులు కృషి చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని మోత్కూరులో అధికారులకు వీధుల్లో తిరిగే మేకలు, పందులే ప్రధాన సమస్యగా మారాయి.

జరిమానాలే ప్రధానాస్త్రం...

కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల గోల తట్టుకోలేక... ఎలాగైన ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో... మున్సిపాలిటీ అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లపై తిరుగుతున్న మేకలు, పందులపై అధికారులు ఫోకస్ పెట్టారు. మేకకు రూ. 500, పందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. ఇలా ఇప్పటివరకు పన్నెండు మేకల యజమానుల నుంచి జరిమానాలు వసూలు చేశారు.

ఇలా ఎందుకంటే...

మున్సిపాలిటీ కేంద్రంలో కొంతమంది మేకలు, పందులను పెంచుకుంటున్నారు. కానీ... వాటిని మేత కోసం అడవిలోకి తీసుకెళ్లకుండా ప్రధాన వీధుల్లో వదిలేస్తున్నారు. అవి ఊరికే ఉండకుండా... మేతకోసం కూరగాయలు, పండ్ల, దుకాణాలు మీద పడి మేస్తూ వ్యాపారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి.

ప్రమాదాలకు దారి తీస్తున్నాయి..

అంతేనా...రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ మల మూత్ర విసర్జన చేస్తున్నాయి. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదాలకు దారి తీస్తున్నాయని మున్సిపాలిటీ కార్యాలయానికి చాలా ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు ఎలాగైన పరిష్కారం చెప్పాలనుకున్న అధికారులు జరిమానాల అస్త్రం ఉపయోగిస్తున్నారు.

ఇదీ చూడండి:భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ తమిళిసై అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.