ETV Bharat / state

'హాథ్రస్​ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలి'

author img

By

Published : Oct 3, 2020, 6:25 PM IST

యూపీలోని హాథ్రస్​లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతు భువనగిరి కలెక్టరేట్ ముందు ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తలు ఆందోళన చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ జిలా కలెక్టర్ అనితా రామచంద్రన్​కి వినతి పత్రాన్ని సమర్పించారు.

mrps-demand-accused-in-up-hathras-incident-should-be-punished-immediately
'హాథ్రస్​ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలి'

ఉత్తరప్రదేశ్​లోని హాథ్రస్​లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ ముందు ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

సమాజంలో మహిళలు రాత్రిపూట కాదు.. ఉదయం కూడా ఒంటరిగా తిరిగే అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా ఆకతాయిలకు వివిధ రాజకీయ పార్టీలు కొమ్ముకాస్తున్నంతకాలం దళిత మహిళలపై దాడులు జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​కి వినతి పత్రాన్ని అందించారు.

MRPS activists demand return of assigned lands
అసైన్డ్ భూములను తిరిగి వాపస్ ఇవ్వాలని ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తల డిమాండ్

వాపస్ ఇవ్వాలి

అభివృద్ధి కార్యక్రమాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం లాక్కున్న దళిత, గిరిజనుల అసైన్డ్ భూములను తిరిగి వాపస్ ఇవ్వాలని ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దళిత, గిరిజనులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇవ్వాలని.. లేకుంటే ఎకరానికి 10 లక్షల చొప్పున, రూ.30 లక్షలు దళిత, గిరిజనుల ఖాతాల్లో వేయాలని కోరారు. పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్​లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.