ETV Bharat / state

ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది: ఎంపీ వెంకటరెడ్డి - మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం

కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడబోన్నసీఎం కనీసం టెస్టులు కూడా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 15 లక్షల ఖర్చుతో 25 ఆక్సిజన్ సిలిండర్లను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన అందించారు.

mp komatireddy venkatreddy donet oxizen cilenders to the hospital
భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సీజన్ సిలిండర్​లు అందించిన ఎంపీ కొమటిరెడ్డి
author img

By

Published : May 21, 2021, 4:32 PM IST

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 15 లక్షల ఖర్చుతో 25 ఆక్సిజన్ సిలిండర్లను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను జిల్లా కలెక్టర్​కు అందజేశారు.

ప్రజలు కరోనాతో బాధపడుతుంటే సీఎం కేసీఆర్ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొవిడ్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడబోన్న ముఖ్యమంత్రి కనీసం టెస్టులు కూడా చేయడం లేదని విమర్శించారు. తెలంగాణను దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజలను అప్పుల్లో చిక్కుకునేలా చేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి: రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.