హైదరాబాద్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి, జూలూరు, భట్టుగూడెం, పెద్దరావులపల్లి మధ్య ఉన్న లో- లెవెల్ బ్రిడ్జి మీదుగా మూసీ పారుతోంది. బీబీనగర్- పోచంపల్లి మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు నది ప్రవాహం కారణంగా పాఠశాలకు, కళాశాలకు వెళ్ళలేకపోయారు. మూసీ నది ప్రవాహానికి పక్కనే ఉన్న వరిపొలాలు నీట మునిగి రైతులకు నష్టం కలిగింది.
ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు