ETV Bharat / state

మెదక్​లో ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలి: శేరి సుభాష్​ రెడ్డి - mlc sheri subash reddy latest news

మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కోరారు. రాష్ట్ర శాసన మండలి వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. క్వశ్చన్ అవర్ సెషన్​లో ఈ అంశాన్ని హోంమంత్రి మహమూద్​ అలీ దృష్టికి తీసుకెళ్లారు.

మెదక్​ పట్టణంలో ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి

author img

By

Published : Sep 16, 2020, 10:41 AM IST

రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ల​ సమస్యను ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి శాసన మండలి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర శాసన మండలి వర్షాకాల సమావేశాల్లో భాగంగా క్వశ్చన్​అవర్​ సమయంలో హోంమంత్రి మహమూద్​ అలీకి వివరించారు.

మెదక్​లో ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలని... గతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్​ సిగ్నల్​ వ్యవస్థ పనిచేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని 11 జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లు లేవని, వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఔటర్ రింగ్​రోడ్ తర్వాత ట్రాఫిక్ పోలీస్ లేకపోవడం వల్ల నిజామాబాద్- నాగపూర్ రహదారిపై ట్రాఫిక్ అదుపు తప్పుతోందని వివరించారు.

ట్రాఫిక్ రద్దీని గుర్తించి ట్రాఫిక్ పోలీసులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హోమంత్రి... సమస్యను పరిష్కరిస్తామని... ట్రాఫిక్ పోలీసులు లేనిచోట లా అండ్ ఆర్డర్ పోలీసులతో ట్రాఫిక్​ నియంత్రణ చేస్తామని బదులిచ్చారు.

ఇదీ చూడండి: గ్రేటర్‌లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.