మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ సమాజం ప్రణబ్‌ముఖర్జీని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీయే ఛైర్మన్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని అన్నారు. అటువంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదన్నారు..
ఇవీ చూడండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నేడే