యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి పేర్కొన్నారు. వాసాలమర్రి గ్రామంతో పాటు గిరిజన తండాలు, అన్ని గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తుర్కపల్లి మండలాన్ని ఆదర్శంగా తయారు చేయాడానికి ప్రజాప్రతినిధులు పాటు పడాలని సూచించారు.
తాగు, సాగునీరుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 280 హెచ్ఆర్ఎస్ ట్యాంకులు మంజూరయ్యాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తుర్కపల్లిలో చేపట్టబోయే ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణంతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
ఇదీ చూడండి: సైబర్ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్