రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ప్రభుత్వం ఈ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువచ్చిందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులను ఐక్యం చేయటం, వారికి గిట్టుబాటు ధర కల్పించడమే.. నియంత్రిత సాగు లక్ష్యమని ఆయన వెల్లడించారు.
ఒక పంటకు ధర వస్తే , రైతులంతా అదే సాగు చేస్తున్నారని.. అవసరానికి మించి పంట మార్కెట్‌కి రావటం వల్ల ధర పలకడం లేదని మంత్రి తెలిపారు. మన ప్రాంత ఆహార అవసరాలు గుర్తించి, దానికి అనుగుణంగా రైతులు పంటలు పండించాలని, అందుకే రైతులు ఏ పంట పండిస్తున్నారనే విషయం విధిగా అధికారులకు తెలిజేయాలన్నారు.