యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 30 మంది వలస కూలీలు వివిధ రైస్ మిల్లుల్లో పనిచేస్తున్నారు. వీరు గత రెండు మూడు నెలల క్రితం పొట్టకూటి కోసం బిహార్ రాష్ట్రం నుంచి వచ్చారు.
వచ్చిన నెల రోజులకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. తమ వాళ్లు బిహార్లో ఎలా ఉన్నారోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తమ పిల్లలు బిహార్లో ఉన్నారని... వారి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వం సహకరించారని కోరుతున్నారు.
నెలరోజుల క్రితం తహసీల్దార్ తమ వివరాలు తీసుకున్నారని... ప్రభుత్వం వలస కూలీలకు అందించే 500 రూపాయలు, బియ్యం అందింది కానీ తమ ఆరోగ్య పరీక్షలు నిర్వహించలేదని వాపోతున్నారు. త్వరగా ప్రభుత్వం తమ స్వంతరాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?