యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన ఓ వ్యక్తి ఒంట్లో బాగుండకపోవటంతో సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. సదరు వ్యక్తికి వైద్యులు కరోనా నిర్ధరణ పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. పీపీఈ కిట్ ఇచ్చి అతన్ని వదిలించుకొన్నారు. కరోనా రావటంతో ఆస్పత్రి ఆవరణలోని బెంచీపైనే బాధితుడు ఐదు గంటల పాటు ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు.
విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి కూతురు.. తండ్రి పరిస్థితి చూసి చలించిపోయారు. వైద్యులను అడిగితే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగి పరిస్థితి చూసిన విలేకర్లు వీడియోలు తీస్తుండటంతో, చూసిన వైద్యులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాధితుడిని వెంటనే 108 వాహనంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి తరలించారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'