ETV Bharat / state

మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం: కోమటిరెడ్డి

స్వాతంత్ర సమరయోధుడు వేమవరం మనోహర్ పంతులు... ఉమ్మడి నల్గొండ జిల్లాకే తలమానికమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. మోత్కూర్​లో మనోహర్ పంతులు శత జన్మదినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం: కోమటిరెడ్డి
మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం: కోమటిరెడ్డి
author img

By

Published : Jan 1, 2020, 11:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​లో స్వాతంత్ర సమరయోధుడు వేమవరం మనోహర్ పంతులు శత జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ పంతులుకు తెలంగాణ బాపు అనే బిరుదు ప్రధానం చేశారు. అనంతరం ఇండియన్ రెడ్​ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

జిల్లాకే తలమానికం

రామన్నపేట మండలం జనంపల్లిలో జన్మించిన మనోహర్ పంతులు... ఉమ్మడి నల్గొండ జిల్లాకే తలమానికమని కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కొనియాడారు. 15 ఏళ్ల పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. సమాజాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. మనోహర్ పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ సందర్భంగా 27 మంది స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. మనోహర్ పంతులు జీవితం ఆధారంగా చిత్రీకరించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో కవిపోతన దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ళ విఠాలాచారి, తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షులు పున్నం వెంకయ్య, తెలంగాణ రాష్ట్ర ఆయిల్​ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, రెడ్​క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ లక్ష్మీ నరసింహా రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పాల్గొన్నారు.

మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం: కోమటిరెడ్డి

ఇదీ చూడండి: 'ఆర్ఆర్​ఆర్​' అభిమానులకు నిరాశ తప్పలేదు..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.