Man Suicide After Making Video call to Wife : భార్యాభర్తల మధ్య మాటల యుద్ధాలు, గొడవలు జరగడం సర్వ సాధారణమే. ఇవన్నీ చాలా మంది తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలే అయినా వాటినే కొందరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ సమస్యలు తమకు తప్ప ఎవరికీ లేవని ఫీలవుతున్నారు. తమ బాధలన్నింటికీ ఒక్క చావే పరిష్కారం అని భావించి క్షణికావేశంలో విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో చిన్న చిన్న సమస్యలను సీరియస్‌గా తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Selfie Suicide Video : కుటుంబ కలహాలతో ఓ యువకుడు.. సెల్ఫీ తీసుకుని మరీ ఆత్మహత్య!
Man Suicide In yadadri : తాజాగా భార్యకు వీడియో కాల్ చేసి లైవ్‌లో భర్త ఆత్యహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్(28) ఉప్పల్‌లోని సరస్వతి కాలనీలో భార్య నిత్యశ్రీతో కలిసి ఉంటున్నారు. ఇతను మెట్రో రైలు సిగ్నలింగ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే వీరికి వివాహం జరిగింది.
Young man suicides in Patancheru : బతకాలనిలేదని.. సెల్ఫీవీడియో సోదరికి పంపి.. యువకుడి ఆత్మహత్య
భార్యది ఇదే నల్గొండ జిల్లా అమ్మనబోలు గ్రామం. ఆమె గర్భిణీ కావడంతో వారం రోజుల క్రితం సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు నుంచి భార్య సీమంతానికి సంబంధించి భర్త ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఆ క్రమంలో బంధువులను ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అనే విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఇది కాస్త గొడవకు దారి తీసింది. ఇదే క్రమంలో ఆస్తి తగాదాలు కూడా తలెత్తాయి.
మనస్తాపానికి గురైన నరేష్ శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్‌లోనే అప్పటికే ఫ్యాన్‌కు చీరను కట్టి ఉన్న భర్త, భార్య చూస్తుండగానే చీర మెడకు బిగించుకొని ఉరేసుకున్నాడు. దీంతో నిత్యశ్రీ కుటుంబ సభ్యులు వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చేసరికి మృతి చెంది ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణాకావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. శ్రీమంతం ఫంక్షన్‌తో కళకళలాడాల్సిన ఇల్లు కాస్త బంధువుల రోదనలతో నిండిపోయింది. తమతో ఈ విషయంలో చర్చించి ఉంటే తాము సర్ది చెప్పేవారమని ఇరు కుటుంబాల పెద్దలు వాపోయారు.
Suicides in Telangana Today : క్షణికావేశం.. తీరని విషాదం.. కుటుంబం సహా ఆరుగురి ఆత్మహత్య
Young man selfie suicide in Hyderabad : 'నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు.. సూసైడ్ చేసుకుంటున్నా'