యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా కుంబాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే వేడుకలో భాగంగా ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో యాగశాల నిర్మాణం చేపట్టారు. పరిసరాలను శుభ్రపరిచారు. స్మార్త ఆగమ సంప్రదాయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.


అద్భుతం.. శివాలయం: 2017 జూన్లో శివాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గర్భాలయం, విమానం, మహామండపం, నంది, బలిపీఠం, పార్వతీదేవి మందిరాన్ని కృష్ణశిలతో అద్భుతంగా రూపొందించారు. మహానంది ప్రధానాకర్షణగా నిలువనుంది. యాదాద్రి నారసింహుని సన్నిధి పునర్నిర్మాణం పూర్తి కాగా.. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పునర్నిర్మితమైన ఆలయ శోభను చూసి తన్మయత్వం చెందుతున్నారు.
ఇవీ చదవండి: 'కడుపులో ద్వేషం పెట్టుకుని కపటయాత్రలు చేస్తే ఏం లాభం..?'