ETV Bharat / state

లాక్ డౌన్ కట్టుదిట్టం...భారీగా కేసులు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. పెద్ద మెుత్తంలో సొమ్ము జరిమానా రూపంలో సమకూరింది.

'భారీగా కేసులు నమోదు... పెద్ద మెుత్తంలో జరిమానా '

author img

By

Published : Apr 17, 2020, 5:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అంటు వ్యాధుల నియంత్రణ చట్టం కింద రెండు కేసులు, ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఎనిమిది కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద 4 కేసులు, సెక్షన్ 188 కింద 178 కేసులు మొత్తంగా 492 మందిపై కేసులు నమోదయ్యాయి.

భారీగా వసూలు...

జిల్లాలో 254 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 26 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోటారు వాహనాల చట్టం కింద 4,072 కేసులు నమోదయ్యాయి. జరిమానా రూపంలో 15,22,860 లక్షల రూపాయలు వసూలయ్యాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో 197 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 70 మంది నుంచి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని బీబీనగర్, రాజపేట, బొమ్మలరామారం, యాదగిరి గుట్ట , భువనగిరి, వలిగొండ, మోత్కూర్ మండలాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.