ETV Bharat / state

Yaddari Temple: యాదాద్రీషునికి ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం

శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రీశునికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన విశేషపూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సుమారు గంట పాటు స్వామివారి నమస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

laxa pushparchana held in a grand way in yadadri temple

author img

By

Published : Aug 4, 2021, 8:10 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం వైభవంగా జరిగింది. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో కైంకర్యాలు మొదలుపెట్టారు. కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో నిజాషేకం, సుదర్శన నారసింహ హోమము, నిత్య కళ్యాణ పర్వాలను ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఏకాదశి పర్వదినాన్నీ పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు రంగురంగుల పువ్వులతో లక్షపుష్పార్చన జరిపారు. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ సుమారు గంట పాటు స్వామి వారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన విశేషపూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని కరీంనగర్​ ఇంటెలిజెన్స్​ ఎస్పీ రాజ మహేందర్ నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

laxa pushparchana held in a grand way in yadadri temple
స్వామివారిని దర్శించుకున్న కరీంనగర్​ ఇంటలీజెన్స్​ ఎస్పీ రాజ మహేందర్ నాయక్ కుటుంబం

ఈ పూజలను ప్రతీ మాసం... శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. లక్ష పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... నిత్య కళ్యాణం, సుదర్శన నారసింహ హోమము, అభిషేకం, అర్చనలో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజున ఆలయానికి వివిధ విభాగల ద్వారా 5 లక్షల 45 వేల 826 రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

యాదాద్రీషునికి ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం
ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.