తమ భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సాదినేని విజయ, ఉపేందర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి చెందిన సాదినేని రామయ్య పేరిట సర్వే నెంబర్ 47, 54లో ఆరున్నర ఎకరాల భూమి ఉంది. 2005లో రామయ్య మరణించిన తర్వాత... ఇతరులు విక్రయించినట్లు సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విజయ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో 2018 నుంచి ఆర్వోఆర్ కేసు నడుస్తోంది. ఎలాంటి విచారణ జరపకుండా... ముడుపులు తీసుకొని ఏకపక్షంగా ప్రత్యర్థి పక్షం వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ