కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు. శనివారం సాయంత్రం బాలాలయం బయట ఉట్లోత్సవం నిర్వహించి... ఆలయంలో రుక్మిణి కల్యాణం జరిపారు. పలు రకాల పూలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం, కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అలీని ఫాలో అయిన దొంగలు.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!