సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. యాదాద్రిలో రోడ్డు విస్తరణ బాధితులకు మద్దతుగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు.
అధైర్య పడొద్దు..
అడగకుండానే కొన్ని ప్రాంతాలకు వందల కోట్లు ధారాదత్తం చేస్తున్న సీఎం.. యాదాద్రి రోడ్డు విస్తరణలో ఇండ్లు, షాపులు కోల్పోతున్న బాధితులకు ఎందుకు న్యాయం చేయట్లేదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపిన ఎంపీ.. నిర్వాసితులకు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:క్రికెటర్ హనుమ విహారిని సత్కరించిన మంత్రి కేటీఆర్