ETV Bharat / state

సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్​లోని గ్రీన్​ ఇండస్ట్రీయల్​ పార్క్​లో ఈచ్​ వన్​- ప్లాంట్​ వన్​ నినాదంతో మొక్కలు నాటారు. ఫిబ్రవరి 15, 16, 17 తేదిల్లో సుమారు లక్షా ముప్పైరెండు వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తామని టీఎస్​ఐఐసీ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు.

సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు
సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు
author img

By

Published : Feb 17, 2020, 8:04 PM IST

సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 15, 16, 17 తేదీల్లో సుమారు లక్షా ముప్పైరెండు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టామని టీఎస్​ఐఐసీ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామ పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్​లో సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను జరిపారు. పార్క్‌లో ఈచ్ వన్- ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటారు.

సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు

అనంతరం లాంగ్ లీవ్ కేసీఆర్ నినాదాలతో కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంచుకున్నారు. హరితహారంలో భాగంగా ఇండస్ట్రీయల్ పార్క్‌లో మొక్కలను పెంచి కేసీఆర్‌కు బహముతిగా ఇస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.