కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం సమీపంలోని భీమలింగం వద్ద భక్తులు పోటెత్తారు. విగ్రహం వద్ద మూసీ నది ప్రవహిస్తున్నప్పటికీ నీటిలో నుంచే నడిచివెళ్లారు. నదిలో పసుపు, కుంకుమ చల్లి కార్తిక దీపాలు వెలిగించి నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు.
లింగం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల తాకిడి ఎక్కువైంది. సంగం మూసీ వంతెన వద్ద వాహనాల రాకపోకలతో రద్దీ నెలకొంది.
ఇదీ చదవండి: ఆధ్యాత్మికం: దేవరకద్రలో దీపాల కాంతులతో శివాలయాలు