BJP Leaders welcome Etela Rajender at choutuppal: దేశంలోనే అసమర్థ సీఎం కేసీఆర్ అని సర్వేలో తేలిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. 'ప్రజలు కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యం పేరుతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్న ఈటల... రాజకీయాలు మాని వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం పర్యటనకు వెళ్తున్న ఈటలకు చౌటుప్పల్ వద్ద భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. లింగోజిగూడెం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఈటల నివాళులు అర్పించారు. భాజపా మాత్రమే మంచి పాలన అందిస్తుందన్న ఈటల... రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: TRSPP: నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం... ఎంపీలకు సీఎం దిశానిర్దేశం