ETV Bharat / state

లాక్​డౌన్​ వార్తల నేపథ్యంలో పంతంగి టోల్​ప్లాజా వద్ద రద్దీ - lock down in hyderabad

హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధిస్తారనే వార్తల నేపథ్యంలో యాదాద్రి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి వరకు 27 వేలకు పైగా వాహనాలు టోల్​ప్లాజా దాటి వెళ్లాయని సిబ్బంది తెలిపారు.

pantangi toll plaza
లాక్​డౌన్​ వార్తల నేపథ్యంలో పంతంగి టోల్​ప్లాజా వద్ద రద్దీ
author img

By

Published : Jul 1, 2020, 4:19 PM IST

హైదరాబాద్​లో 15 రోజులపాటు లాక్​డౌన్​ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టోల్​గేట్ల వద్ద రద్దీ పెరిగింది. నగర వాసులు సొంతూళ్లకు పయనవుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్తున్న వారితో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగింది.

యాదాద్రి జిల్లా పంతంగి టోల్​ప్లాజా వద్ద సాధారణ రోజులతో పోలిస్తే వాహనాల సంఖ్య పెరిగినట్లు సిబ్బంది తెలిపారు. రోజూ దాదాపు 23 వేల వాహనాలు టోల్​ప్లాజా దాటివెళ్తాయని.. నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి వరకు 27 వేలకు పైగా వాహనాలు వెళ్లాయన్నారు. ఇవాళ రాత్రికి మరిన్ని వాహనాలు వెళ్లే అవకాశం ఉందన్నారు.

లాక్​డౌన్​పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ప్రజలు ముందు జాగ్రత్తగా స్వగ్రామాలకు క్యూ కడుతున్నారు. మార్చిలో విధించిన లాక్​డౌన్​ సందర్భంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇవీచూడండి: లాక్​డౌన్​ ఎఫెక్ట్: గూడూరు టోల్​ప్లాజా వద్ద వాహనబారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.