యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని రైతు బజార్లో షెడ్లు నేలకూలాయి. పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద పార్క్ చేసిన బైకులపై ఫ్లెక్సీ కూలి రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. భువనగిరి-నల్లగొండ రహదారికి ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై పడటంతో అప్రమతమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి