యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో భారీ వడగండ్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుమలగిరి, బొమ్మలరామరం గ్రామాల్లో కరెంటు స్తంభాలు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. బలమైన ఈదురు గాలుల వల్ల పలు చోట్ల ఇళ్ల పైకప్పులు, రేకులు లేచిపోయాయి.
బొమ్మలరామారం బీసీ కాలనీలో మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు ఎగిరి పోయింది. పైకప్పు ఎవరిపై పడక పోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. బొమ్మలరామరం, మర్యాల, మేడిపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిపోయాయి.