ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రం(sri lakshmi narasimha swamy temple) భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తవత్సలుని క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఉదయం నుంచి కొండపై బాలాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మొక్కు పూజలతో మండపాల్లో రద్దీ నెలకొంది. స్వామివారికి నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతికి అధికారులు నిరాకరించారు.
పనుల్లో వేగం...
యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయం ఉద్ఘాటన కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) సీఎం కేసీఆర్‌కు(CM KCR) హామీ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్టోబరు- నవంబరు నెలల్లో ముహూర్తం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కొండపైన కట్టడాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన దసరాలోగా పూర్తిచేయాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (YTDA) భావిస్తోంది. ప్రారంభోత్సవం నాటికి భక్తులకు మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పనులు పూర్తిచేసేందుకు గుత్తేదారులతో సమీక్ష నిర్వహణకు యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: YADADRI TEMPLE: అష్టదిక్పాలకులను పొందుపరించేందుకు యాడా సన్నద్ధం