యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావటం వల్ల యాదాద్రికి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి. కార్తీక దీపారాధనలో, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ భద్రత, అభివృద్ధి పనుల కారణంగా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'