Organ donation: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. తమ కుమారుడు ప్రమాదానికి గురైనా మరొకరికి ప్రాణం పోసే ఆకాంక్షతో అవయవ దానానికి ఒప్పుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు
ఈ నెల 5వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై యశోద ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో చెన్నైకి తరలించారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి ట్రాఫిక్‌ను నియంత్రించి అంబులెన్స్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన కోల మనోహర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.
హుటాహుటిన అతన్ని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్టు యశోదా వైద్యులు ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేసే అవకాశం ఉందని.. కుటుంబ సభ్యులకు వైద్యులు తెలుపగా.. అవయవదానానికి వారు అంగీకరించారు.శంషాబాద్ విమానాశ్రయం వరకు అంబులెన్స్‌లో తరలించి అక్కడి నుంచి విమానం ద్వారా చెన్నైకి తరలించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అంబులెన్స్‌లో ఆ గుండెను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించేందుకు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రణకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.అత్యవసర సమయంలో మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు.
ఇదీ చదవండి: