ETV Bharat / state

కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

author img

By

Published : Feb 22, 2021, 12:12 PM IST

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా మందులు అందజేశారు.

health-camp-at-pedda-kandukuru-in-yadagiri-gutta-mandal
కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

చావా ఫౌండేషన్, ఆర్.కె. హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 72వ ఉచిత వైద్య శిబిరాన్ని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. పల్లె పల్లెకి ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం ప్రారంభించారు.

వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు కోరారు. సుమారు 200 మందికి బీపీ, షుగర్​, గుండె, ఛాతి, రక్త పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ లక్ష్మీనారాయణ, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.