Harishrao Fires on BJP: మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపై మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో స్పందించారు. భాజపా మేనిఫెస్టో హాస్యాస్పదమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని దుయ్యబట్టారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ఇలా మాయమాటలతోనే మోసం చేశారని ఆరోపించారు. 4 టెక్స్‌టైల్ పార్క్‌ల కేటాయింపులో తెలంగాణకు మొండిచేయి చూపారని విమర్శించారు.
ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం 2016లో ప్రకటిస్తే ఇప్పటికీ అతి గతిలేదని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదని ఆక్షేపించారు. మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారని ఆరోపించారు. హార్ ఘర్ కో జల్ పథకానికి మిషన్ భగీరథ ఆదర్శమని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర వింటేనే ప్రజల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు కంటే.. కాంట్రాక్టుల మీద ప్రేమ ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
"మొత్తం ఇప్పుడు లెక్క తీస్తే కేంద్రం రాష్ట్రానికి రూ.33,545 కోట్లు బాకీ ఉంది. కొత్తగా ఏమీ ఇవ్వొద్దు. మాకు రూ.33,545 కోట్లు ఇస్తే చాలు. ఇవన్నీ పక్కన పెట్టి మేనిఫెస్టోలు అంటూ మీరు చేస్తున్న ప్రకటనలను మునుగోడు ప్రజలు నమ్మరు." - హరీశ్‌రావు మంత్రి
ఇవీ చదవండి: BJP మెనిఫెస్టో రిలీజ్... మునుగోడు ప్రజలపై హామీల వర్షం
హోరాహోరీగా పార్టీల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు
తొలిరోజే ఖర్గే కీలక నిర్ణయం.. CWC స్థానంలో స్టీరింగ్ కమిటీ.. రంగంలోకి సుబ్బిరామి రెడ్డి