అకాల వర్షాలతో చేతిదాకా వచ్చిన పంట నీటిపాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కురిసిన వర్షానికి ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. దత్తాయిపల్లి గ్రామంలో రైతులు అధికారులకు, కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు.
ధాన్యం పండించడం ఒక కష్టమైతే... అమ్ముకోవడం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోస్తే... వర్షానికి పూర్తిగా తడిసి మొలకెత్తిందని వాపోయారు.
ఇదీ చదవండి: ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..