యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి... డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇళ్ల పథకంలో భాగంగా... ఆత్మకూర్‌కు 100 కేటాయించి, శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. కనీసం ఇళ్లు లేని వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఉగాది నాటికి నిర్మాణం పూర్తి చేసి, గృహ ప్రవేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రెండు పడక గదుల నిర్మాణానికి శంకుస్థాపన - రెండు పడక గదుల నిర్మాణానికి శంకుస్థాపన
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌లో రెండు పడక గదుల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వచ్చే ఉగాది నాటికి నిర్మాణాలు పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
రెండు పడక గదుల నిర్మాణానికి శంకుస్థాపన