Polluting industries in yadadri : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని కాలుష్యకారక పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉక్కుపాదం మోపింది. ఫిబ్రవరిలో ఈటీవీ భారత్ ప్రధాన సంచికలో ప్రచురితమైన 'సాగు భూమి నిస్సారం.. ఆ కంపెనీదే పాపం’ కథనానికి పీసీబీ అధికారులు స్పందించారు. రైతులు కూడా పీసీబీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Polluting industries closed in Yadadri : రాష్ట్ర, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దండుమల్కాపురం, ఎల్లగిరి, అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లోని రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టారు. బృందావన్, వీజే సాయికెమ్, ఎస్వీఆర్, రావుస్, కెమిక్ లైఫ్ సైన్స్ పరిశ్రమల మూసివేతకు నోటీసులు అందజేసినట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి రాజేందర్ సోమవారం తెలిపారు. జయ ల్యాబ్, వినిత్ ల్యాబ్, ఆర్కిమెడిక్, ఆప్టిమస్, హెజీలో, రిసాన్ పరిశ్రమలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు.
- సంబంధిత కథనం : సాగు భూమి నిస్సారం.. ఆ కంపెనీదే పాపం