ETV Bharat / state

కూరగాయల సాగుకు కేరాఫ్​ కొత్తజాల

రైతులు ఇప్పుడిప్పుడే సేద్యాన్ని లాభాల బాట పట్టించడానికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ సహకారం, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ గత మూడేళ్లుగా మార్కెట్​లో డిమాండ్ ఉన్న కూరగాయలు సాగు చేస్తూ, అధిక లాభాలు గడిస్తున్నారు. అలాంటి రైతులను మరికొంత మంది స్ఫూర్తిగా తీసుకొని విభిన్న పంటలసాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

farmers-are-now-turning-to-alternative-crops-in-order-to-vegetable-crops
కూరగాయల సాగుకు కేరాఫ్​ కొత్తజాల
author img

By

Published : Jun 9, 2020, 11:02 PM IST

సాంప్రదాయ పంటల సాగు లాభసాటిగా లేకపోవటం వల్ల కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఈ విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొత్తజాలకు చెందిన పలువురు రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో వంద మంది రైతులు ఉండగా అందరిలాగానే తమకున్న వ్యవసాయ భూముల్లో వరి, పత్తి, కంది పంటలు సాగు చేశారు. కాలం అనుకూలించినా... వేసిన పంటలకు పెద్దగా లాభం రాకపోగా అప్పులే మిగిలాయని వాపోయారు. ప్రస్తుతం వారు ఆధునిక పద్ధతిలో వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేసి లాభాలు పొందుతున్నట్లు వెల్లడించారు.

డ్రిప్ విధానంతో సాగు..

గ్రామంలో పెద్దగా జల వనరులు లేకపోవటం వల్ల బోరుబావులపైన ఆధారపడి సాగు చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటలు సాగు చేయటం ప్రారంభించారు. డ్రిప్ విధానంతో తక్కువ నీరు సరిపోతుందని, కలుపు ఎక్కువ రాదని, కూలీల ఖర్చు తగ్గుతుందని రైతులు గుర్తించారు. కొంతమంది రైతులు ప్రభుత్వ సహకారంతో ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు చేసి డ్రిప్​ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 45 రోజుల నుంచి 90 రోజుల వరకు చేతికొచ్చే టమాట, వంకాయ, సొరకాయ, మిర్చి, బీర, కాకర, చిక్కుడు, తదితర కూరగాయల పంటలు సాగుచేస్తూ ఎకరాకు లక్ష వరకు లాభం గడిస్తున్నారు.

నేరుగా సంతలోనే విక్రయాలు..

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను దళార్లకు విక్రయించకుండా నేరుగా వారు సంతలో విక్రయిస్తున్నారు. యాదగిరిగుట్ట, వరంగల్ జిల్లా చేర్యాల, బచ్చన్నపేట మెదక్ జిల్లా జగదేవ్ పూర్ సంతలో నేరుగా విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. నీటి సౌకర్యం బట్టి కూరగాయ పంటలు సాగు చేస్తున్న రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.