యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మార్కెట్ యార్డులో కందుల ధాన్యానికి సరిపడా గోనె సంచులు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. వరుసక్రమం తప్పి కందులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా సీపీఎం కార్యదర్శి జహంగీర్ ఈ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: మగాడు గర్భం దాలుస్తాడట.. దేవుడు కొడుకును ప్రసాదిస్తాడట.!