ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ అధికారుల తనిఖీలు - wine shops at yadadri inspected by excise police

యాదాద్రి భువనగిరి జిలాల్లోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న మద్యం సీసాల శాంపిల్స్​ సేకరించి నాణ్యత పరీక్షల కోసం పంపిస్తామని ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ శాఖ జిల్లా అధికారి కృష్ణప్రియ వెల్లడించారు.

wine shops at yadadri inspected by excise police
జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ అధికారుల తనిఖీలు
author img

By

Published : Sep 21, 2020, 10:57 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సోదాలు జరిపినట్లు ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ శాఖ జిల్లా అధికారి కృష్ణప్రియ తెలిపారు. దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలు, క్రయవిక్రయాల నమోదు, సీసాల లేబుళ్లు, మూతలను తనిఖీలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

అనుమానం ఉన్న మద్యం సీసాల శాంపిల్స్​ సేకరించి నాణ్యత పరీక్షల కోసం పంపిస్తామని కృష్ణప్రియ వెల్లడించారు. జిల్లాలోని నాలుగు సర్కిల్​ సీఐలు వారి పరిధిలో కాకుండా మరో సర్కిల్​ పరిధిలో తనిఖీలు చేపడుతున్నారని ఆమె తెలిపారు.

ఇదీ చదవండిః యాదాద్రిలో భక్తుల ఆహ్లాదం కోసం వాటర్‌ ఫౌంటైన్‌లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.