యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్లలో ఓ శునకం పేలుడు పదార్థం తినబోయి ప్రమాదవశాత్తు చనిపోయింది. పేలుడు పదార్థాన్ని నోట కరుచుకొని తినే క్రమంలో పేలిపోయి మృతి చెందింది. లైసెన్స్ లేని పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఆ కుక్క నోటకరుచుకొని వచ్చిందని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వైద్యం వికటించి బాలింత మృతి